Deepika Padukone: ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నా 1 y ago
మానసిక ఆరోగ్యంపై తరచూ అవగాహన కల్పిస్తుంటారు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె. కెరీర్లో దూసుకెళ్తాన్న సమయంలో ఆమె మానసికంగా కుంగుబాటుకు గురై ఇబ్బందిపడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మ్యాగజైన్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఏం జరుగుతుందో అర్థంకాక ఎంతో ఆవేదనకు గురైనట్లు చెప్పారు. ఆ సమయంలో కుటుంబసభ్యులు తనకెంతో అండగా నిలిచారని వివరించారు.